కామారెడ్డి అర్బన్/బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డి రూరల్ : ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పలువురు మేధావులు పేర్కొన్నారు. పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షంతోపాటు పత్రికలపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని సూచించారు.
బడుగు, బలహీన వర్గాలు, విద్యార్థులకు పత్రికలే గొంతుకలు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలి. అంతేగాని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారన్న సాకుతో సాక్షి జర్నలిస్టులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం మంచి సంప్రదాయం కాదు.
– ముదాం అరుణ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు, ఎస్‌ఎఫ్‌ఐ
ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకలు పత్రికలే. విమర్శలను ప్రభుత్వాలు సరైన విధంగా తీసుకోవాలి. పత్రికల గొంతునొక్కడం సరికాదు. సాక్షి మీడియాపై ఏపీ సర్కారు వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి.
– కొంగల వెంకటి,
రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ
ఉపాధ్యాయ సంఘం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్య నిజాలను నిర్భయంగా రాసే వారికి సంకెళ్లు వేసినట్లుంది. ఇలా చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అవుతుంది. జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడం సరికాదు. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి.
– నాగం సాయిబాబా, న్యాయవాది, ఎల్లారెడ్డి
ప్రజలు, ప్రజాస్వామికవాదుల పక్షాన నిలబడే పత్రికలపై ప్రభుత్వాల దాడులు సర్వసాధారణమయ్యాయి. ప్రజల గొంతుకగా నిలబడుతున్న సాక్షిపై ఏపీ ప్రభుత్వం ఇలాగే కేసు పెట్టింది. ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
– విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్
తప్పులను ఎత్తిచూపుతున్నారనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షం గొంతునొక్కాలని చూస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యక్తులపై కాకుండా.. దానిని ప్రచురించిన పత్రిక సంపాదకుడు, జర్నలిస్టులపై కేసులు పెట్టడం అన్యాయం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి.
– అయ్యాల సంతోష్, ఏఎస్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బాన్సువాడ
ప్రజాసమస్యలను ప్రభుత్వానికి వినిపించే పత్రికలపై అణచివేత ధోరణి సరికాదు. ప్రతిపక్ష పార్టీ చేసిన విమర్శలు అబద్ధమైతే అధికార పక్షం వాస్తవాలను చెప్పి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలి. జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి.
– పి.లక్ష్మీనారాయణ మూర్తి, న్యాయవాది. బాన్సువాడ
స్వేచ్ఛను హరించొద్దు
స్వేచ్ఛను హరించొద్దు
స్వేచ్ఛను హరించొద్దు
స్వేచ్ఛను హరించొద్దు
స్వేచ్ఛను హరించొద్దు
స్వేచ్ఛను హరించొద్దు