
ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య
ఎల్లారెడ్డి: ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సబ్దల్‌పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. సబ్దల్‌పూర్ గ్రామానికి చెందిన బత్తుల సావిత్రి (20) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి తండ్రి రాంచందర్ ఇంటికి రాగా, ఉరివేసుకున్న కూతురును చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. సావిత్రికి లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన మార్గపు ప్రదీప్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నదని, అతడు నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాంచందర్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గూపన్‌పల్లిలో ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్‌హెచ్‌వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. గూపన్‌పల్లికి చెందిన చింతకుంట రాజు(30) ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా రాజు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల కారణంగా తాగుడుకు బానిసయ్యాడు. ఈక్రమంలో గురువారం తీవ్ర మనస్తాపానికి గురై, ఇంటిలో ఎవరు లేని సమయంలో రాజు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో వివరించారు.