
కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి
కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లాలో గోసంగి కులం వారు లేరని బేడ బుడగ జంగాలు మాత్రమే ఉన్నారని, బేడ బుడగ జంగాల పేరు మీద కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరుపాటి వేణు అన్నారు. ఈమేరకు కామారెడ్డి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుశురాం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గిర్ని వెంకటి, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పత్తి భాష, రాష్ట్ర జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు, జేఏసీ వైస్ చైర్మన్ తూర్పాటి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.