
కొలువుదీరిన తిరుపతి బాలాజీ జెండా
● 11 రోజుల పాటు పూజలు
● పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో మంగళవారం రాత్రి తిరుమల తిరుపతి శ్రీ బాలాజీ జెండా కొలువుదీరింది. పాత బస్టాండ్ ప్రాంతంలోని హనమాన్ ఆలయం ముందు గ్రామస్తులు, జెండా కమిటీ సభ్యులు బాలాజీ జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. భక్తులు గోవిందా..గోవిందా... వెంకట రమణ గోవిందా అంటూ బాలాజీ జెండాకు స్వాగతం పలికారు. ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జన అనంతరం తిరుమల జెండా వస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. జెండా మద్నూర్‌లో 11 రోజుల పాటు పూజలు అందుకుంటుందని.. అనంతరం ఈ జెండా తిరుపతి శ్రీవారి ఆలయానికి భయలుదేరుతుందని వారు పేర్కొన్నారు.