
ఆపదలో ఆదుకున్న వారే గొప్పవారు
● ఆర్డీవో పార్థసింహారెడ్డి
ఎల్లారెడ్డి: ఆపదలో ఆదుకున్న వారే గొప్పవారని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి తహసీల్ కార్యాలయంలో లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డిలో చాలా మంది ఇళ్లు కూలాయని, చెరువు కట్టలు తెగిపోవడంతో పంటలు నీట మునిగిపోవడం, ఇసుక మేటలు వేయడం, పంటలు కొట్టుకుపోయాయన్నారు. ఇలాంటి వారికి ఆపత్కాలంలో లయన్స్ క్లబ్ వారు నిత్యావసర వస్తువులు అందించడం చాలా సంతోషదాయకమన్నారు. లయన్స్‌క్లబ్ గవర్నర్ అమర్నాథ్‌రావు, బసవేశ్వర్‌రావు, సంజీవరెడ్డి, రమేష్, నర్సింహరాజు, నాగరాజు, పద్మావతి, డీటీ శ్రీనివాస్, గిర్దావర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తదితరులున్నారు.