
ఎస్సారెస్పీ వరద గేట్ల మూసివేత
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ జలాశయం వరద గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు శుక్రవారం నిలిపివేశారు. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 50 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 355 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 4500, ఎస్కెప్ గేట్ల ద్వారా 3500, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 666 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా 1090.10(77.23 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
దిగువకు 240 టీఎంసీలు
గత నెలలో ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు రావడంతో ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు. మధ్యలో రెండ్రోజులు మాత్రమే నిలిపి వేశారు. తరువాత మళ్లీ వరద పోటెత్తడంతో గత నెల 27 నుంచి ఈనెల 4 వరకు నిరంతరం నీటి విడుదల చేపట్టారు. గరిష్టంగా 5.75 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రాజెక్ట్ నుంచి 240 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు.
● ఇన్‌ఫ్లో తగ్గుముఖం
● గోదావరిలోకి నీటి విడుదల నిలిపివేత