
అటవీ భూముల ఆక్రమణలను ఉపేక్షించం
పెద్దకొడప్‌గల్ : అటవీ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని డివిజినల్ అటవీశాఖ అధికారి(డీఎఫ్‌వో) సునీత హెచ్చరించారు. కాటేపల్లి తండా శివారులో కబ్జాకు గురైన అటవీ భూములను గురువారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాగు చేస్తున్న పంటలను పొక్లెయిన్‌ల సహాయంతో చదును చేయించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో సునీత మాట్లాడుతూ కాటేపల్లి తండా శివారులోని 275, 118 సర్వే నంబర్లలో 1700 ఎకరాల్లో అటవీ భూములున్నాయని, అందులో 80 ఎకరాల వరకు కబ్జాకు గురైందని పేర్కొన్నారు. కబ్జాకు గురైన భూముల్లోని పది హెక్టార్లలో మొక్కలు నాటుతామని, మిగతా భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం స్థానికులు మాట్లాడుతూ తండా పరిధిలో కబ్జాకు గురైన 250 నుంచి 300 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవాలని, లేకపోతే మొత్తం వదిలేయాలని కోరారు. లేదంటే మళ్లీ ఆక్రమించుకుంటామన్నా రు. పిట్లం ఎఫ్‌ఆర్‌వో రవికుమార్, సీఐ రవికుమార్, బిచ్కుంద, పిట్లం, మద్నూర్, పెద్దకొడప్‌గల్ ఎస్సైలు మోహన్‌రెడ్డి, రాజగౌడ్, విజయ్ కొండ, అరుణ్‌కుమార్ తదితరులున్నారు.
డివిజినల్ అటవీ అధికారి సునీత
కాటేపల్లి తండాలో ఆక్రమణల తొలగింపు
ఇరవై ఏళ్లుగా పండిస్తున్నాం..
మాకు రెండెకరాల భూమి ఉంది. రూ. లక్ష పెట్టుబ డి పెట్టి పత్తి సాగు చేస్తున్నాం. 20 ఏళ్లుగా ఈ భూ మిలోనే పంట పండిస్తున్నాం. ఇప్పు డొచ్చి భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. మేము ఎలా బతకాలి.
– పంకా బాయి, రైతు, కాటేపల్లి తండా

అటవీ భూముల ఆక్రమణలను ఉపేక్షించం

అటవీ భూముల ఆక్రమణలను ఉపేక్షించం