
చిరుత సంచార ప్రాంతాల పరిశీలన
నవీపేట: మండలంలోని నందిగామ, సిరన్‌పల్లి గ్రామాలలో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ఫారెస్ట్ అధికారులు శుక్రవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. 15రోజుల కిందట నందిగామ శివారులో చిరుత కనిపించగా, కొందరూ ఫొటో తీశారు. కానీ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. అలాగే రెండు రోజుల కిందట సిరన్‌పల్లి శివారులో మేకల మందపై చిరుత దాడి చేసి ఒక మేకను తీవ్రంగా గాయపర్చింది. ఈ రెండు ఘటనలను కొందరు యువకులు శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఫారెస్ట్ నిజామాబాద్ బీట్ ఆఫీసర్ సుధీర్, సెక్షన్ ఆఫీసర్ జహ్రూలు స్పందించి, రెండు ప్రాంతాలను సందర్శించారు. పాదముద్రలను సేకరించారు. చిరుత సంచారం నిజమేనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చిరుత సంచార ప్రాంతాల పరిశీలన