
మంచిప్పలో ఒకరి ఆత్మహత్య
మోపాల్: మండలంలోని మంచిప్పలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సుస్మిత శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మంచిప్పకు చెందిన ఆలకుంట పోశెట్టి (45) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. దీంతో జీవితంపై విరక్తి చెంది అతడు గురువారం సాయంత్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
దాడి కేసులో నిందితుడి రిమాండ్
నిజామాబాద్ రూరల్: ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో షేక్ రెహన్ అనే వ్యక్తిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. నెహ్రునగర్‌కు చెందిన షేక్ అఫ్సర్‌అలీ ఈనెల 17న మండలంలోని రాంనగర్ గ్రామంలోని అతడి అక్క ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ఈ సమయంలో రాంనగర్‌కు చెందిన షేక్‌రెహన్ వ్యక్తిగత కక్షతో అతడి తలపై గాయపరిచాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో వివరించారు.
బైక్ చోరీ కేసులో..
రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఎస్‌కె మజీద్‌ను బైక్ చోరీ కేసులో పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్ తెలిపారు. బైపాస్ రోడ్డుపై నిలిచి ఉన్న సుజుకి ఆక్సిస్ మోటార్ సైకిల్‌ను మజీద్ చోరీ చేయగా, ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుడిని గుర్తించి, రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.