
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
సిరికొండ: మండలంలోని మై లారం గ్రామ శి వారులో ఆ యల కుంట చె రువు కట్ట పక్క న చెట్ల పొదలలో గుర్తుతెలి యని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 35ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై పరిశీలించారు. మైలారం పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా ఈ నెల 23న గ్రామంలో నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతదేహంతో బైక్‌పై వెళుతున్నట్లు రికార్డయినట్లు తెలిసింది.
డ్రంకెన్‌డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో గురువారం సా యంత్రం పోలీసులు వాహనాల తనిఖీతోపాటు, డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి, శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. జడ్జి ఇద్దరికి 4రోజుల జైలుశిక్ష విధించినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.