
బాధితులకు అండగా భరోసా కేంద్రం
● సీపీ సాయిచైతన్య
ఖలీల్‌వాడి: బాధిత మహిళలు, పిల్లలకు సహాయం అందించడంతోపాటు మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తోందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నా రు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయం వద్ద ఉన్న భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో, రేప్ కేసులలోని ఏడుగురు బాధిత పిల్లలు, మహిళలకు భరోసా కేంద్రం తరఫున చెక్కులను శుక్రవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మనోధైర్యం, న్యాయం అందించడం పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యాలలో ఒకటన్నారు. కార్యక్రమంలో డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, భరోసా సెంటర్ కో–ఆర్డినేటర్ జీ రోజా, లీగల్ అడ్వయిజర్ డయాణ గీతిక, మహిళా పీఎస్ ఎస్సై పుష్పావతి, మౌనిక, సవిత తదితరులు పాల్గొన్నారు.