
బోల్తాపడిన స్కూల్ వాహనం
కామారెడ్డి క్రైం: ఓ స్కూల్ వ్యాన్ బోల్తా పడి, ఆరుగురు విద్యార్థులకు గాయాలైన ఘటన జిల్లా కేంద్రానికి సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. పట్టణ శివారులో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన తూఫాన్ వాహనం సాయంత్రం 5గంటల ప్రాంతంలో విద్యార్థులను ఎక్కించుకొని స్కూల్ నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటన సమయంలో వాహనంలో 15 మంది విద్యార్థులు ఉండగా, వారిలో ఆరుగురు విద్యార్థుఽలకు స్వల్ప గాయాలయ్యాయి.గాయపడిన వారిని వెంటనే పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. వాహనం అదుపుతప్పి పడినట్లు భావిస్తున్నారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు.
● ఆరుగురు విద్యార్థులకు గాయాలు

బోల్తాపడిన స్కూల్ వాహనం