
జిల్లా ఆస్పత్రిలో ఊడిపడిన పెచ్చులు
అసంపూర్తిగా...
వృథాగా రైతు బజార్
శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025
– 9లో u
అర్ధంతరంగా నిలిచిపోయిన
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు
‘ఇళ్ల నిర్మాణాన్ని
వేగవంతం చేయాలి’
నస్రుల్లాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పను లను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్ట ర్ చందర్ నాయక్ ఆదేశించారు. గురువా రం నస్రుల్లాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారుల సంఖ్యను పెంచి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలన్నారు. అనంత రం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చే సిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్నారు. ఓటరు జాబితాను పరిశీలించా రు. అనంతరం గిరిజన గురుకుల బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నా ణ్యమైన భోజనం అందించాలన్నారు. ఆయ న వెంట ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్, పంచా యతీ కార్యదర్శి రాజేష్, గిరిజన గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ మాధవరావు, పంచాయతీ కార్యదర్శులు సవిత, సాయిలు, సౌందర్య తదితరులున్నారు.
డాక్టర్ వి.శంకర్‌కు
సినారె పురస్కారం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డికి చెందిన అ సోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.శంకర్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా సాహిత్య సంస్థ ల సమాఖ్య మహాకవి సినారె సాహితీ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన కవి, ర చయిత, పరిశోధకులు, అధ్యాపకులుగా అందిస్తున్న బహుముఖ సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈనెల 27న భువనగిరిలో నిర్వహించే కార్యక్రమంలో శంకర్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
పోచారంలోకి ఇన్‌ఫ్లో
నాగిరెడ్డిపేట : ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి గురువారం వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఎగువన ఉన్న లింగంపేట, గుండారం వాగుల ద్వా రా ప్రాజెక్టులోకి 1,513 క్యూసెక్కుల నీరు వ స్తోందని ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామ ర్థ్యం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.386 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
‘ఎరువు ఎక్కువైతే భూసారం దెబ్బతింటుంది’
భిక్కనూరు : రైతులు పంటల సాగులో మోతాదుకు మించి ఎరువులు వాడితే భూసారం దెబ్బతింటుందని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అధికారి అజ్మీర రాజు పేర్కొన్నారు. గురువారం ఆయన భిక్కనూరు సింగిల్‌విండోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసే పంటలకు సరిపోయే మోతాదులోనే ఎరువులు ఇవ్వాలని సూచించారు. రైతులు రసాయనిక ఎరువుల వినయోగాన్ని తగ్గించాలన్నారు. ఆయన వెంట విండో చైర్మన్ భూమయ్య, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, డీఏవో మోహన్‌రెడ్డి, ఏడీఏ అపర్ణ, డీసీవో రామ్మోహన్, ఏడీఎం రమ్య, ఏవో నరేందర్, ఏఈవో వినోద్ ఉన్నారు.
నేడు డయల్ యువర్ ఆర్టీసీ
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ‘డయల్ యువర్ ఆర్టీసీ’ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆర్‌ఎం జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలను ఫోన్ చేసి తెలపాలని పేర్కొన్నారు.
నిజామాబాద్, ఆర్‌ఎం : 99592 26011
బాన్సువాడ డీఎం : 99592 26020
కామారెడ్డి డీఎం : 99592 26018
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది కామారెడ్డి పట్టణ పరిస్థితి. జిల్లా కేంద్రంగా మారినా..
మౌలిక సదుపాయాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. పట్టణంలో సరైన మార్కెట్లు
లేకపోవడంతో కూరగాయలను రోడ్లమీదే విక్రయించాల్సి వస్తోంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : డెయిలీ మార్కెట్‌లో ని ర్మించిన మడిగెలన్నీ దళారులు, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయి. అది పేరుకే కూరగాయల మార్కెట్.. కానీ మడిగెలన్నీ కిరాణ దుకాణాలతో నిండిపోయా యి. కూరగాయలు అమ్మేవారు, రైతులు ఏదో ఒక దుకాణం ముందు కూర్చుని అమ్ముకోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. సుభాష్‌రోడ్డులో, తిలక్‌రోడ్డులో నో పార్కింగ్ పేరుతో బోర్డులు తగిలించారు. దీంతో ఆ రోడ్లపై కూరగాయలు అమ్మే పరిస్థితి లేదు. కొత్త బస్టాండ్ సమీపంలోని చర్చి గ్రౌండ్‌లో రైతులు వచ్చి కూరగాయలు అమ్ముకుంటారు. వానకు నా నుతూ, ఎండకు ఎండుతూ కూరగాయలు అమ్ముకోవాల్సి రావడంతో రైతులు ఇబ్బందిపడుతున్నా రు. కాగా ఆదివారం వ్యాపారాలు మూసి ఉంటా యి. దీంతో రైతులంతా సుభాష్‌రోడ్డులో ఇ రుౖవైపు లా కూర్చుని కూరగాయలు అమ్ముతారు. అక్కడ కూడా ఎలాంటి సౌకర్యాలులేవు. ప్రతి గురువారం నడిచే అంగడి (వార సంత)లో కూడా కనీస సౌక ర్యాలు లేవు. కనీసం మూత్రశాలలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జబర్దస్తీగా వసూళ్లు..
కూరగాయలు అమ్మడానికి మార్కెట్లు లేకపోవడంతో రైతులు రోడ్ల మీద ఎక్కడో ఓచోట కూర్చుని అమ్ముకుని వెళుతుంటారు. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించరు. కానీ తైబజార్ మాత్రం వసూళ్లు జబర్దస్తీగా నడుస్తున్నాయి. బల్దియాను గుప్పిట పెట్టుకుని కొందరు తైబజార్ వసూళ్లకు సంబంధించి కాంట్రాక్టు పొంది ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. గంపకు రూ. 10 చొప్పున ఇవ్వాల్సిందే. రై తులకు తాగునీటి సౌకర్యం, కూర్చునేందుకు షెడ్లు, మూత్రశాలలు వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోవడం లేదు. కానీ తైబజార్ మాత్రం వసూలు చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో రైతు బజార్ నిరుపయోగంగా ఉన్నా, రోడ్లమీదే కూరగాయలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నా, ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోయినా, ముక్కుపిండి తైబజార్ వసూలు చేస్తున్నా ఇటు అధికార పక్షం నేతలుగాని, అటు ప్రతిపక్షాలు కానీ పట్టించుకోవడం లేదు. రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయ త్నం అధికారులు సైతం చేయడం లేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం పనులను పూర్తి చేయించడానికి ఎవరూ చొరవ చూపడం లేదు. ఇప్పటికైనా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజాప్రతినిధు లు చొరవ చూపి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణంలోని గాంధీ గంజ్‌లో రైతు బజార్ నిర్మించారు. అయితే మార్కెట్‌ను ఇక్కడికి తరలించకుండా కొందరు అడ్డుతగిలారు. కూరగాయల మార్కెట్ తరలివెళ్తే ఇతర వ్యాపారాలపై ప్రభావం పడుతుందన్న అంచనాలతో ప్రస్తుత డెయిలీ మార్కెట్ ప్రాంత వ్యాపారులు అధికారులు, నాయకులను మేనేజ్ చేసి రైతుబజార్‌కు తరలించకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో రైతుబజార్ వృథాగా ఉంటూ తాగుబోతులకు అడ్డాగా మారింది.
వృథాగా ఉంటున్న రైతుబజార్
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనంలో గురువారం మధ్యాహ్నం పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. రక్తనమూనాలు సేకరించే విభాగం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పాత భవనం కావడంతో పెచ్చులూడి పడ్డాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. మరమ్మతులు చేయిస్తామన్నారు.
ఎల్లారెడ్డి పల్లె దవాఖానాలో..
ఎల్లారెడ్డిరూరల్ : ఎల్లారెడ్డి పట్టణంలోని పల్లె దవాఖానాలో బుధవారం రాత్రి పెచ్చులూడి పడ్డాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఉన్నతాధికారులు స్పందించి భవనానికి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
జిల్లా కేంద్రంలో నిరుపయోగంగా
రైతుబజార్
పిల్లర్ల దశ దాటని
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం
సౌకర్యాలు కల్పించకున్నా
తైబజార్ వసూలు
కూరగాయలతో పాటు ఫిష్, మటన్ మార్కెట్‌లు అన్నీ ఒకేచోట ఉండాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. అందులో భాగంగా కామారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు నిధులు మంజూరవగా.. స్థానిక గాంధీ గంజ్‌లో నిర్మాణం మొదలుపెట్టారు. అయితే నిధుల లేమితోపాటు చేసిన పనులకు బిల్లులు రాక అది పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలం వాహనాల పార్కింగ్‌కు, చెత్త వేయడానికి ఉపయోగపడుతోంది.
ఇద్దరికి స్వల్పగాయాలు

జిల్లా ఆస్పత్రిలో ఊడిపడిన పెచ్చులు

జిల్లా ఆస్పత్రిలో ఊడిపడిన పెచ్చులు

జిల్లా ఆస్పత్రిలో ఊడిపడిన పెచ్చులు

జిల్లా ఆస్పత్రిలో ఊడిపడిన పెచ్చులు

జిల్లా ఆస్పత్రిలో ఊడిపడిన పెచ్చులు