
కొనసాగుతున్న వైద్య శిబిరం
తాడ్వాయి: దేమికలాన్ గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతోంది. గ్రామానికి చెందిన పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో స్పందించి అధికారులు గ్రామంలో బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బుధవారం ఆరుగురిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన వైద్యులు.. గురువారం మరో ముగ్గురిని పంపించారు. గురువారం మరో 25 మందికి మందికి వైద్య పరీక్షలు చేశారు. వాంతులు, విరేచనాలు ఎందుకు అవుతున్నాయో తేలకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
మిషన్ భగీరథ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ రాజేందర్‌కుమార్, డీఈ ప్రవీణ్‌రెడ్డి, ఏఈ ప్రశాంత్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఆర్డీవో వీణ, మండల వైద్యాధికారి ఖాసిం గురువారం గ్రామంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. తాగునీరు శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపించామని డీఎంహెచ్‌వో తెలిపారు. శనివారం ఫలితాలు వస్తాయన్నారు. ప్రజలకు జాగ్రత్తలను వివరించారు.
డయేరియా నివారణకు చర్యలు
కామారెడ్డి టౌన్ : జిల్లాలో డయేరియా నివారణకు చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆర్డీవో వీణతో కలిసి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులతో మాట్లాడారు. దేమికలాన్‌లో తొమ్మిది మంది డయేరియాతో బాధపడుతుండగా.. వారికి జీజీహెచ్‌లో వైద్యం అందించామని డీఎంహెచ్‌వో తెలిపారు. ఇందులో ఆరుగురిని డిశ్చార్జి చేశామని, మిగతా ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

కొనసాగుతున్న వైద్య శిబిరం