
బాబల్‌గావ్ సమస్యలను పరిష్కరిస్తాం
పెద్దకొడప్‌గల్(జుక్కల్): రెండు సంవత్సరాల క్రితం విలీన గ్రామంగా ఏర్పడిన బాబల్‌గావ్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ చందర్ నాయక్ స్పష్టం చేశారు. బుధవారం బాబల్‌గావ్‌ను ఆయన సందర్శించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలో ఇంక ఏ శాఖలు ఉన్నవి, కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండల పరిధిలో ఏ శాఖలు నిర్వహణలోకి వచ్చాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ దశరథ్, ఎంపీడీవోలు శ్రీనివాస్, లక్ష్మీకాంత్ రెడ్డి, ఎంఈవో ప్రవీణ్, తదితరులున్నారు.