
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
బాన్సువాడ రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఎంతగానో కృషి చేస్తోందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్ ఆర్య అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. ప్రభుత్వం డీఏ, పీఆర్‌సీ పెండింగ్‌లో పెట్టడం అన్యాయమని వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. ఎస్‌జీటీలకు ప్రమోషన్లలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. జిల్లా ఉపాద్యక్షులు వేదప్రకాష్, తారాచంద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.