
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని డీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డీఈవో ఎస్.రాజుకు వినతిపత్రం అందజేశారు. ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పీఆర్‌సీ ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఈవోకు సన్మానించారు. డీటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, రాష్ట్ర కార్యదర్శి హరికిషన్, జిల్లా అధ్యక్షుడు ఎల్లగారి శంకర్, ప్రధాన కార్యదర్శి పెద్దొళ్ల సాయిలు, గౌరవ అధ్యక్షుడు శివప్రసాద్, తదితరులున్నారు.