
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
మాచారెడ్డి : ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి నాగరాణి సూచించారు. పాల్వంచ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో ఆమె మాట్లాడారు. బాలలు, మహిళల హక్కుల గురించి వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హిమబిందు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు స్వర్ణలత, ఎంఈవో రాంమనోహర్‌రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డి, లీగల్ అడ్వైజర్ సురేశ్ పాల్గొన్నారు.
కోడ్ హోప్ గ్లోబల్ సంస్థ సేవలు ప్రశంసనీయం
బాన్సువాడ రూరల్: కోడ్ హోప్ గ్లోబల్ సంస్థ సేవలు ప్రశంసనీయమని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం ఆమె బాన్సువాడ జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అమెరికాలో విద్యాభ్యాసంతో పాటు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థినులు ఆలా లిఖిత, అన్యా బులుసు, బొల్లినేని పల్లవి, మీనాక్షి అరసదలు పేద విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయం అందించడం అభినందనీయమన్నారు. సంస్థ ద్వారా 40 కంప్యూటర్లు, బాన్సువాడ, పాల్వంచ, సదాశివనగర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు 2 వేల సానిటరీ నాప్కిన్స్, 15 పాఠశాలలకు ఇన్సినరేటర్లు(భస్మీకరణ పరికరం), మరో 8 పాఠశాలలకు సైన్స్‌ల్యాబ్ పరికరాలను విద్యార్థులకు అందజేశారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు, డీఈవో రాజు, ఎంఈవో నాగేశ్వరరావు, చందర్, తదితరులు పాల్గొన్నారు.
ఆహ్వాన పత్రిక అందజేత
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న బోనాల పండుగకు రావాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు ఆహ్వా న పత్రికను అందించారు.మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, నేతలు వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు, సంతోష్ తదితరులున్నారు.
బన్సల్‌తో మాజీ ఎంపీ భేటీ
బాన్సువాడ రూరల్: బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌ను బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యులు బీబీపాటిల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. ఆయన వెంట బాన్సువాడ నియోజకవర్గం ఇన్‌చార్జి శ్రీనివాస్ గార్గే తదితరులు ఉన్నారు.

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’