
బెటాలియన్‌ను సందర్శించిన గవర్నర్
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): తెలంగాణ యూ నివర్సిటీ రెండో స్నాతకోత్సవంలో పాల్గొనేందు కు బుధవారం జిల్లాకు వచ్చిన వర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా డిచ్‌పల్లిలోని టీజీఎస్పీ ఏడో బెటాలియన్‌ను సందర్శించారు. గవర్నర్‌కు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, వీసీ యాదగిరి రావు, బెటాలియ న్ కమాండెంట్ పీ సత్యనారాయణ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, విద్యార్థినులు పు ష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ బెటాలియన్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కాసేపు విశ్రాంతి అనంతరం గవర్నర్ యూనివర్సిటీకి బయలుదేరి వెళ్లారు. కా న్వొకేషన్ ముగిసిన తర్వాత గవర్నర్ తిరిగి బెటాలియన్‌కు చేరుకొని భోజనం చేసి కొద్దిసేపు వి శ్రాంతి తీసుకున్నారు. అనంతరం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అసిస్టెంట్ కమాండెంట్లు శరత్‌కుమార్, కేపీ సత్యనారాయణ, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బెటాలియన్‌ను సందర్శించిన గవర్నర్

బెటాలియన్‌ను సందర్శించిన గవర్నర్

బెటాలియన్‌ను సందర్శించిన గవర్నర్

బెటాలియన్‌ను సందర్శించిన గవర్నర్