
గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాలు
సాక్షి నెట్‌వర్క్:తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బుధవారం గాంధారికి చెందిన పెద్దబూరి సత్యం, కామారెడ్డి మండలం క్యాసంపల్లితండాకు చెందిన వి.రూప్‌సింగ్, కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయకర్త ఎన్.బాలు, ఎల్లారెడ్డికి చెందిన సిద్ధ లక్ష్మికి డాక్టరేట్ పట్టాలు, తాడ్వాయికి చెందిన కొత్తపలి నవీన్ గోల్డ్‌మెడల్ అందుకున్నారు. బుధవారం డిచ్‌పల్లిలోని తెలంగాణ యూ నివర్సిటీలో నిర్వహించిన రెండో స్నాతకోత్సవంలో వీటిని అందుకున్నారు. బంజరా సాహిత్యం– జీవన చిత్రం అంశంపై పరిశోధన చేసినందుకు రూప్‌సింగ్‌కు, ఎకనామిక్స్‌లో ప్రతిభ చూపినందుకు బాలుకు, బీడీ వర్కర్ల జీవన శైలిపై పీహెచ్‌డీ చేసినందుకు సిద్ధ లక్ష్మికి డాక్టరేట్‌లు అందజేశారు.

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాలు

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాలు

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాలు

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాలు