
ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్‌లో జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, ఆదర్శ రైతులు, ఇతర ప్రముఖులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవం అనంతరం కలెక్టరేట్‌కు వచ్చిన గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యేలు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్ తిలకించారు. కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఫొటో ఎగ్జిబిషన్ ఆధారంగా ఆయా శాఖల కార్యక్రమాల వివరాలను తెలిపారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాకు చెందిన ప్రముఖులతో ముచ్చటించారు. ఆయా రంగాల్లో సేవలందిస్తున్న వారి గురించి గవర్నర్ పేరుపేరున వివరాలు తెలుసుకొని అభినందించారు. అనంతరం గవర్నర్ ఆయా రంగాల వారితోపాటు జిల్లా అధికారులతో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు.
గవర్నర్‌తో ఇష్టాగోష్టిలో పాల్గొన్నది వీరే..
పిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్, బల్లాష్టు మల్లేశ్ (థియేటర్ ఆర్టిస్ట్), కందకుర్తి యాదవరావు (చరిత్రకారులు), చిన్ని కృష్ణుడు (ఆదర్శ రైతు), అమృతలత (ప్రముఖ రచయిత), నాళేశ్వరం శంకరం (కవి), వీపీ. చందన్ రావు (కవి, రచయిత), అష్ట గంగాధర్ (జానపద కళాకారులు), పాయల్ కోట్గిర్కర్ (ప్రముఖ తబలా వాయిద్యకారులు), పంచరెడ్డి లక్ష్మణ్ (ప్రముఖ కవి), గణపతి అశోక శర్మ (అష్టావధాని), తల్లావజ్జల మహేశ్‌బాబు (ప్రముఖ కవి), కాసర్ల నరేశ్ రావు ( కవి, రచయిత), ఘనపురం దేవేందర్ (కవి, వ్యాఖ్యాత), డాక్టర్ డి.శారద (ప్రముఖ విద్యావేత్త, రచయిత), గంట్యాల ప్రసాద్ (సాహితీవేత్త), తిరుమల శ్రీనివాస్ ఆర్య (ప్రముఖ కవి), కత్తి గంగాధర్ (సాంస్కృతిక విభాగం విలేకరి), బోచ్కర్ ఓంప్రకాశ్ (కవి, అష్టావధాని), ఆరుట్ల శ్రీదేవి (సాహితీ పరిశోధకులు), శ్రీమన్నారాయణ చారి (కవి, ప్రముఖ వ్యాఖ్యాత), కళా లలిత (ప్రముఖ యాంకర్), బి.కళా గోపాల్ (కవి, రచయిత), మద్దుకూరి సాయిబాబు (సామాజిక సేవా కార్యకర్త, రచయిత), చింతల గంగాదాస్ (కవి, వ్యాఖ్యాత), చింతల శ్రీనివాస్ గుప్తా (ప్రముఖ కవి), డాక్టర్ అన్నందాస్ జ్యోతి (విద్యావేత్త, రచయిత), కై రకొండ బాబు (ప్రముఖ చిత్రకారులు), సిర్ప లింగం (ప్రముఖ కళాకారులు), చిందు బాబయ్య (కళాకారులు), మహమ్మద్ రషీద్ (రేలా రే రేలా ఫేం కళాకారుడు), సాయి లవోలా (జానపద కళాకారులు), జయలక్ష్మి (నాట్య గురువు), గంగాదేవి (జానపద గాయని), పసునూరి వినయ్ కుమార్ (కొరియోగ్రఫర్), టీ స్వప్నరాణి (మ్యూజిక్ అధ్యాపకురాలు), కే సంతోష్ కుమార్ (వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్), అష్ఫాక్ ఆస్పీ (ఉర్దూ కవి, వ్యాఖ్యాత), దారం గంగాధర్ (రచయిత) తదితరులున్నారు.
కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్
తిలకించిన జిష్ణుదేవ్ వర్మ

ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి

ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి

ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి

ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి