
అధికారులెవరూ స్థానికంగా ఉండరు..
జుక్కల్ నియోజకవర్గంలో పోలీసులు తప్ప మరే శాఖల అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండడం లేదని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. అధికారులు కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాల నుంచి వచ్చిపోతున్నారన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఏళ్ల తరబడిగా ఒకేచోట ఉన్నా వారిని బదిలీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఆస్పత్రుల్లో యాంటీ వీనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలని, మద్నూర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ యూనిట్‌కు ట్రాన్స్‌ఫార్మర్ బిగించాలని కోరారు. ఇంటి స్థలం లేని పేదలకు స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.