లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బాణాపూర్ గ్రామ శివారులోని దండ్ల గుట్టపైన అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నందున సోమవారం రాత్రి మొరం ట్రాక్టర్, పొక్లెయిన్ పట్టుకున్నట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి, వాటిని లింగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. గ్రామాల్లో, మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా మొరం తవ్వకాలు చేపడితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
డోంగ్లీ మండలంలో మూడు మొరం ట్రాక్టర్లు..
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని మొగా–డోంగ్లీ ప్రధాన రహదారిపై అక్రమంగా తరులుతున్న మూడు మొరం ట్రాక్టర్‌లను పట్టుకొని సీజ్ చేసినట్లు డోంగ్లీ ఆర్‌ఐ సాయిబాబా తెలిపారు. సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘మొరం అక్రమ తరలింపుపై చర్యలేవి?’ అనే వార్త కథనానికి డోంగ్లీ రెవెన్యూ అధికారులు స్పందించారు. ఉమ్మడి మండలంలో అక్రమంగా మొరం, మట్టిని తరలిస్తుండటంతో మొగా గ్రామ శివారులో దాడులు నిర్వహించామని ఆయన తెలిపారు. మండలంలో ఎక్కడైన అక్రమంగా మొరం, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయనతో పాటు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.