
నీటి స్టోరేజ్ ట్యాంకుల ఏర్పాటు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో నీటి స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కనీస ఏర్పాట్లు లేవని విద్యార్థినులు ధర్నా చేయడంతో కలెక్టర్ డీఎంఎఫ్‌టీ నిధులతో పాఠశాలలో నీటి స్టోరేజి ట్యాంకులు, కొత్త బోర్‌వెల్‌కు కనెక్షన్, ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎంఈవో షౌకత్‌అలీ సూచించారు. మంగళవారం ఆయన శెట్పల్లిసంగారెడ్డి, లొంకల్‌పల్లి, పర్మళ్ల గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పరిశీలించారు. ఎఫ్‌ఎల్‌ఎన్, బేస్‌లైన్ టెస్టుల రిపోర్టులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఫణికుమార్, ఉమామహేశ్వరీ, రాజేందర్, సందీప్, తదితరులున్నారు.
మరుగుదొడ్ల నిర్మాణం పరిశీలన
నస్రుల్లాబాద్: సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘ఒంటికి రెంటికీ.. బయటకే’ అన్న కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో నిలిచిపోయిన మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఎంఈవో చందర్ నాయక్ పరిశీలించారు. త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తయ్యేలా చేస్తామన్నారు.
విద్యుత్ స్తంభం సరిచేశారు
గాంధారి(ఎల్లారెడ్డి): తుమ్మళ్ల శివారులో ప్రమాదకరంగా మారిన విద్యుత్తు స్తంభాలను ట్రాన్స్‌కో సిబ్బంది మంగళవారం సరిచేశారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రమాదకరంగా విద్యుత్తు స్తంభం శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో ట్రాన్స్‌కో సిబ్బంది స్పందించి మరమ్మతులు చేసి స్తంభాన్ని సరిచేశారు.
రైతుల సమస్య పరిష్కారం
కామారెడ్డి టౌన్: చిన్నమల్లారెడ్డి గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యను అధికారులు మంగళవారం పరిష్కరించారు. గ్రామ శివారులోని వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోవడంతో పది రోజులుగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన ట్రాన్స్‌కో అధికారులు మంగళవారం ఉదయాన్నే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయించారు. సమస్యను పరిష్కరించామని డీఈ చక్రవర్తి తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
సదాశివనగర్: అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సర్దార్ నాయక్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్‌హాల్‌లో యూత్ కాంగ్రెస్ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శ్యామ్‌బాబు, భాస్కర్, గంగాధర్, సాయిరెడ్డి, బాల్‌రాజ్ పాల్గొన్నారు.

నీటి స్టోరేజ్ ట్యాంకుల ఏర్పాటు

నీటి స్టోరేజ్ ట్యాంకుల ఏర్పాటు