
మహిళా, శిశు సంక్షేమానికి కృషి
రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోందని మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ కమిషనర్ అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంలో భాగంగా మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసిందన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే అన్నారు. టీచర్లు ఉద్యోగ విరమణ పొందితే రూ.2 లక్షలు, ఆయాలకు రూ. లక్ష ఇస్తున్నామన్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు యూనిఫాంలు అందించబోతున్నామని తెలిపారు. దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.