
ఇబ్బంది పెడుతున్నారు
తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఎమ్మెల్యేగా ఎన్నికై న తొలినాళ్లలో నియోజకవర్గంలో 250కి పైగా బోర్లు తవ్వించానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు తెలిపారు. వాటికి బిల్లుల చెల్లింపు విషయంలో క్యూసీ పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా చెబుతున్నా పరిష్కారం చూపడం లేదన్నారు. ఎల్లారెడ్డి ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ను నియమించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక ఇబ్బందులు తొలగించాలని అధికారులను కోరారు.