
మిషన్ భగీరథ నీళ్ల కోసం ఫిర్యాదు
కామారెడ్డి అర్బన్: మాచారెడ్డి మండలం బంజేపల్లి తండా, సోమారంపేట గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులకు తెలిపిన ఫలితం లేకుండా ఉందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీల మరమ్మతులకు తమ గ్రామ పంచాయతీల్లో నిధులు లేవని బంజేపల్లి, సోమారంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శులు అంటుండగా మిషన్ భగీరథ అధికారులు స్పందించడం లేదని బీఎస్సీ జిల్లా అధ్యక్షుడు కలెక్టర్‌కు వివరించారు. నేతలు దుంప సురే ష్, బొడ్డు సంతోష్, దుబ్బాక నవీన్, తదితరులున్నారు.