నిజాంసాగర్: మంజీర నదిపై నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కోరారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాగమడుగు ఎత్తిపోతల పైపులైన్‌లో భూములు కోల్పోతున్న రైతులతో సబ్ కలెక్టర్ సమావేశం అయ్యారు. నాగమడుగు పనులు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఫేజ్ వన్‌లో 9 కిలోమీటర్ల వరకు పైపులైన్‌లో భూములు కోల్పోతున్న ఒడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాలతో పాటు మల్లూర్ గ్రామ రైతులు సహకరించాలన్నారు. పైపులైన్ ఏర్పాటుకు రైతుల ఆధ్వర్యంలో రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు సర్వే చేశారన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్నారు. సమావేశంలో తహసీల్దార్ భిక్షపతి, రైతు నాయకులు సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ప్రతి విద్యార్థి మొక్కను నాటి సంరక్షించాలి’
కామారెడ్డి అర్బన్ : ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని ప్రిన్సిపల్ చీ ఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(వన్యప్రాణుల సంరక్షణ) ఎలుసింగ్ మేరు సూచించారు. శుక్రవారం గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. వ న్యప్రాణులుంటేనే అడవుల రక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులందరు మొక్కలు నాటాలని, అడవులను సంరక్షించడంగా ద్వారా ప ర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూ చించారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో నిఖిత, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, కామారెడ్డి డి విజన్ అటవీ అధికారి రామకృష్ణ, రేంజ్ అధి కారి రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రా మస్తులు పాల్గొన్నారు.
23న జాబ్ మేళా
కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్‌లోని 121 వ నంబర్ గదిలో ఈనెల 23న జాబ్‌మేళా నిర్వ హించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్స్‌లో పలు ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసుండి, పదో తరగతి ఫెయిల్ అయినవారూ మేళా లో పాల్గొనవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కు 99856 78292, 76719 74009 నంబర్ల లో సంప్రదించాలని సూచించారు.
మొురాయించిన రైల్వే గేటు
నిజామాబాద్ రూరల్: నగర శివారులోని మాధవనగర్ వద్ద రైల్వే గేటు మొరాయించడంతో అరగంటపాటు వాహనదారులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వైపు (అకోలా– కాచిగూడ) రైలు వస్తోంది. దీంతో గేట్‌మన్ గేటు వేస్తుండగా మధ్యలోనే ఆగిపోయింది. ఒకవైపు రైలు వస్తుండడం, మరోవైపు గేటు పూర్తిగా కిందికి దిగకపోవడంతో వాహనదారులను ఆపేందుకు గేట్‌మన్ ముప్పుతిప్పలు పడ్డాడు. చివరకు తాత్కాలిక గేటును వేశాడు. కొందరు వాహనదారులు గేట్లకు మధ్యలోనే నిలిచిపోయారు. గమనించిన లోకో పైలట్ రైలును నెమ్మదిగా నడిపాడు. వెంటనే రైల్వే సిబ్బంది గేటుకు మరమ్మతులు చేశారు.
పెన్షన్ల హామీ మరిచిన కాంగ్రెస్ సర్కారు
నిజామాబాద్‌అర్బన్: అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఆస రా పెన్షన్ల పెంపు హామీని ప్రభుత్వం అమ లు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించా రు. నగరంలోని లక్ష్మి కల్యాణ మండపంలో శుక్రవారం పెన్షన్‌దారుల, దివ్యాంగుల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగు ల పెన్షన్‌ను రెట్టింపు చేస్తామని ఇచ్చిన హా మీని నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు.
‘నాగమడుగు పైపులైన్ పనులకు సహకరించాలి’
‘నాగమడుగు పైపులైన్ పనులకు సహకరించాలి’