
ఎస్సెస్సీలో ప్రథమ స్థానం సాధించాలి
కామారెడ్డి టౌన్ : ఈ విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానం సాధించేలా విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో విద్యాశాఖ మండల అధికారులు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల హాజరు వంద శాతం నమోదయ్యేలా చూడాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం, రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందించాలన్నారు. భవిత సెంటర్లలో, కేజీబీవీల్లో సివిల్ వర్క్స్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు.
వయోజన విద్య ఓపెన్ స్కూల్, టాస్ అడ్మిషన్‌లను పెంచాలన్నారు. ఎక్కువ సంఖ్యలో పాఠశాలలను విజిట్ చేయని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో రాజు, అధికారులు పాల్గొన్నారు.