
పారిశుద్ధ్యం అమలుపై దృష్టి సారించాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో పారిశుద్ధ్యం అమలుపై దృష్టి సారించాలని ఎల్లారెడ్డి డీఎల్‌పీవో సురేందర్ సూచించారు. నాగిరెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.. గ్రామాల్లో మురికికాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. దీంతోపాటు మురికాలువ వెంట, వర్షపునీరు నిల్వ ఉండేచోట బ్లీచింగ్‌పౌడర్ చల్లించాలని ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వివరాలతోపాటు లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఎంపీడీవో ప్రభాకరచారి తదితరులు పాల్గొన్నారు.