
ఒకటికీ రెంటికీ.. బయటికే..
నస్రుల్లాబాద్: మల మూత్ర విసర్జన చేయాలంటే విద్యార్థులు ఆరు బయటకు కి.మీ.ల దూరం వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల ప్రాంగణంలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. నస్రుల్లాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల అవస్థలు అంతా ఇంతా కాదు. పాఠశాల చుట్టూ నివాస గృహాలు ఉండటంతో ఊరి బయటకు , అటవీ ప్రాంతానికి సైతం వెళ్తున్నారు.
అర్ధంతరంగా నిలిచిన పనులు
పాఠశాల ప్రాంగణంలో రూ.10 లక్షలతో బాల బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. దీనితో గ్రామానికి చెందిన వ్యక్తి పనులు ప్రారంభించారు. అయితే పిల్లర్ల వరకు పనులు పూర్తయ్యాయి. పనులు జరిగిన వరకు బిల్లులు వస్తే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ వ్యక్తి చెబుతున్నారు. పాఠశాలలో 114 మంది విద్యార్థులు ఉండగా అందులో బాలికలు పాత మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారు. కాని బాలురు మాత్రం నిత్యం బహిరంగ ప్రదేశాలకు ,ముళ్ల పొదల్లోకి, గుట్ట ప్రాంతాలకు వెళ్తున్నారు. వర్షాకాలం కాలం కావడంతో జరగకూడని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని తల్లిదండ్రులు భయపడుతున్నారు.
బిల్లులు రాక మధ్యలో
ఆగిపోయిన మరుగుదొడ్ల నిర్మాణం
నస్రుల్లాబాద్ జెడ్పీహెచ్‌ఎస్‌లో
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం
మూత్రశాలలు పూర్తి చేయాలి
పాఠశాలలో మూత్ర శా లలు పనులు ప్రారంభం చూ సి సంతోషపడ్డాం. కాని మా ర్చిలో నిలిచిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కనీస అ వసరాలకు కూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నాం. – చరణ్, 10వ తరగతి
అర్జెంటైనా దూరం పోవాల్సిందే..
పాఠశాలలో అర్జెంట్ అవసరం అయినా అంత దూరం పోయే పరిస్థితి ఉంటుంది. కొంత కాలం రోడ్డు ప్రక్కన అవసరం తీర్చుకున్నా నివాస గృహాల వారు అభ్యంతరం తెలపడంతో ఊరి చివరకు వెళ్తున్నాం.
– అఖిల్, 10వ తరగతి

ఒకటికీ రెంటికీ.. బయటికే..

ఒకటికీ రెంటికీ.. బయటికే..