
29న అమిత్‌షా రాక
సుభాష్‌నగర్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈనెల 29వ తేదీన నిర్వహించే రైతు సమ్మేళనానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారని ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. కార్యక్రమానికి రైతు లు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాల ని కోరారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ త్యాగం వల్లే కశ్మీర్ దేశంలో అంతర్భాగమైందని, ఆయన త్యాగాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు మర్చిపోలేరని పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాలుగు దశాబ్దాల పసుపు రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అమిత్ షా నిజామాబాద్‌కు వస్తున్నారన్నా రు. పసుపు, ఇతర పంటల రైతుల భవిష్యత్ తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశముందని తెలిపారు. అదేరోజు మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తన వ్యక్తిగత విజ్ఞప్తి మేరకు కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఆయన కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరిస్తారన్నారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి శాశ్వత భవనం కోసం జెడ్పీ వెనక ప్రాంతంలో రెండెకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించామని, ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన, ఉద్యమాలకు ఊపిరిలూదిన నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కోరింది తానేనన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్, నాయకులు మోహన్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.