
విధుల్లో నిర్లక్ష్యం తగదు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఐకేపీ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని, గ్రామాల్లో ఐకేపీ ద్వారా చేపట్టనున్న వివిధ కార్యక్రమాల్లో మరింత ప్రగతి సాధించాలని అదనపు జిల్లా గ్రామీణాధివృద్ధి అధికారి విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం నాగిరెడ్డిపేట ఐకేపీ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధికి బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. మండల సమాఖ్య అధ్యక్షులు బెస్త శాంత, సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.