
షార్ట్ ఫిలిమ్స్‌తో బడివైపు విద్యార్థులు
లింగంపేట: షార్ట్ ఫిలిమ్స్‌తో విద్యార్థులు బడివైపు ఆకర్షితులవుతారని డీఈవో రాజు అన్నారు. మంగళవారం శెట్పల్లి ఉన్నత పాఠశాలలో షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏఎక్స్‌ల్–ఎఫ్‌ఎల్‌ఎన్ (అసిస్టెడ్ లాంగ్వేజ్ అండ్ మాథ్స్ లర్నింగ్– ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ)లో భాగంగా ఏఐపైన ష్టార్ట్ ఫిలిమ్ తీసినట్లు తెలిపారు. డిజిటల్ విద్యపై విద్యార్థులకు అవగాహన వస్తుందన్నారు. విద్యార్థులకు డిజిటల్ విద్యపై ఆసక్తి పెరిగి బడికి క్రమం తప్పకుండా వస్తారన్నారు. ఉపాధ్యాయులు షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువగా రూపొందించి విద్యా ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు. షార్ట్ ఫిల్మ్ అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలని సూచించారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ స్టేట్ రిసోర్స్ పర్సన్ అఖిల్‌ను డీఈవో అభినందించారు. నిర్మించడానికి ఆర్థిక సహకారం అందజేసిన శెట్పల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వసుధను అభినందించారు. జిల్లా సెక్టోరల్ అధికారి వేణుశర్మ, ఎంఈవోలు శౌకత్‌అలీ, రామస్వామి, సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.