
మొక్కలు నాటి సంరక్షించాలి
దోమకొండ: గ్రామాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత పంచాయితీ కార్యదర్శులదేనని మండల ప్రత్యేకాధికారి, జిల్లా హార్టికల్చర్ అఽధికారి జ్యోతి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన పంచాయితీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. అంటు వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా పన్ను వసూలు చేసిన రసీదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఈజీఎస్ ఏపీవో రజని పాల్గొన్నారు.