
ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతతో నిర్మించుకోవాలి
గాంధారి(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లను నాణ్యతతో సకాలంలో నిర్మించుకోవాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన డీపీవో మురళి, ఎంపీడీవో రాజేశ్వర్‌తో కలిసి మండల పరిదిలోని పోతంగల్ కలాన్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోయించారు. మహిళా సంఘాల్లో కుడుతున్న విద్యార్థుల దుస్తులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎంపీవో లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
నస్రుల్లాబాద్: మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల ప్రత్యేక అధికారి దయానంద్ అన్నారు. సోమవారం బొమ్మన్‌దేవ్‌పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో సూర్యకాంత్, జీపీ సిబ్బంది ఉన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎంపీడీవో ప్రకాష్ అన్నారు. మంగళవారం తిమ్మాపూర్‌లో పనులను పరిశీలించారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): బొల్లారంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మంగళవారం స్థానిక ఎంపీడీవో ప్రభాకరచారి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాల్లో ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పంచాయతీ కార్యదర్శి సంతోష్ ఉన్నారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): త్వరగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని మండల ప్రత్యేక అధికారి కిషన్ సూచించారు. మంగళవారం వడ్లం, కాస్లాబాద్ గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చందర్ నాయక్