● భిన్న సంస్కృతుల నిలయం జుక్కల్‌ ప్రాంతం ● పండుగలు, శుభకార్యాలలో టోపీ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

● భిన్న సంస్కృతుల నిలయం జుక్కల్‌ ప్రాంతం ● పండుగలు, శుభకార్యాలలో టోపీ తప్పనిసరి

Jun 29 2025 2:32 AM | Updated on Jun 29 2025 2:32 AM

● భిన

● భిన్న సంస్కృతుల నిలయం జుక్కల్‌ ప్రాంతం ● పండుగలు, శుభ

బిచ్కుంద వర్షాల కోసం భజన చేస్తున్న భక్తులు(ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జుక్కల్‌ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. దీంతో జుక్కల్‌, పెద్దకొడప్‌గల్‌, మద్నూర్‌, బిచ్కుంద మండలాల్లోని చాలా గ్రామాల ప్రజలు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఈ ప్రాంతం భిన్న సంస్కృతుల నిలయం. చాలా మంది తెలుగుతో పాటు కన్నడ, మరాఠీ, హిందీ భాషలు మాట్లాడతారు. ఈ ప్రాంత ప్రజలు సంప్రదాయాలకు విలువ ఇస్తారు. కట్టు, బొట్టు ఆకట్టుకునేలా ఉంటాయి. మహిళలు చీర గోచీ కట్టుకుని, కొంగును తలపై కప్పుకుంటారు. పురుషులు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. అలాగే టోపీలు పెట్టుకుంటారు. వాటిని వార్కారీ టోపీలని, గాంధీ టోపీలని వ్యవహరిస్తారు. జుక్కల్‌ ప్రాంతంలో చాలా గ్రామాల్లో విఠలేశ్వర స్వామి భక్తులు ఉంటారు. ఏటా పండరిపూర్‌కు పాదయాత్రగా వెళుతుంటారు. అందరూ టోపీ ధరించి ఆలయాల దర్శనానికి వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ సప్తాహాలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. వారం రోజులపాటు భజనలు సాగుతుంటాయి. ఆయా కార్యక్రమాలలో తప్పనిసరిగా వార్కారీ టోపీ ఉంటుంది.

శాకాహార భోజనానికే ప్రాధాన్యం..

చాలా ప్రాంతాల్లో పండుగల సందర్భంగా మాంసాహారానికి ప్రాధాన్యతనిస్తుంటారు. కానీ జుక్కల్‌ ప్రాంతం అందుకు భిన్నం. ఇక్కడ పండుగల సందర్భంగా శాకాహార భోజనాలే ఉంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలోనూ శాకాహారమే వడ్డిస్తారు. కొద్ది మంది మాత్రమే మాంసాహారానికి ప్రాధాన్యతనిస్తారు. ఇళ్లల్లో కూడా చాలామంది మాంసాహారం వండుకోరు. పాత తరం వారైతే మాంసం ముట్టరు.

నిత్యం ధరించే వారెందరో..

జుక్కల్‌ ప్రాంతంలో కొంతమంది నిత్యం టోపీ ధరిస్తారు. పొద్దున స్నానం చేయగానే సంప్రదాయంగా పూజలు చేస్తారు. నుదుట బొట్టు తప్పనిసరి పెట్టుకుంటారు. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా టోపీ ధరించి వెళ్లేవారు చాలా మంది కనిపిస్తారు. పండుగల సందర్భంగా దాదాపు అందరూ టోపీ ధరించి కనబడుతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలోనూ టోపీలు పెట్టుకుంటారు. క్వాలిటీని బట్టి రూ. 10 నుంచి రూ. వంద వరకు వివిధ ధరల్లో ఈ టోపీలు లభిస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో బంధుమితులను టోపీలతో సత్కరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన

జుక్కల్‌ నియోజకవర్గం విభిన్న సంస్కృతులకు

నిలయం. ఇక్కడ కట్టు, బొట్టు, ఆహార్యం అన్నీ

భిన్నమే.. ప్రత్యేక రోజులలో మహిళలు చాలా

వరకు చీర గోచీతో దర్శనమిస్తారు. కొంగును

తలపై కప్పుకుంటారు. నుదుట పెద్ద బొట్టు

ధరిస్తారు. పురుషులు తెల్లని ధోతీ, తెల్లటి

చొక్కాతోపాటు తలపై టోపీ పెట్టుకుని

కనిపిస్తారు. నిత్యం టోపీ ధరించడం ఇక్కడ

ప్రత్యేకంగా కనిపిస్తుంది. జుక్కల్‌ ప్రాంతంలో

టోపీ ధారణపై సండే స్పెషల్‌..

● భిన్న సంస్కృతుల నిలయం జుక్కల్‌ ప్రాంతం ● పండుగలు, శుభ1
1/1

● భిన్న సంస్కృతుల నిలయం జుక్కల్‌ ప్రాంతం ● పండుగలు, శుభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement