
స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాటాలి
ఎల్లారెడ్డి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి చేపట్టాల్సిన వ్యూహం గురించి దిశా నిర్దేశాలు జారీ చేశారు. నూతన మండల పార్టీ అధ్యక్షుల స్థానం కోసం పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నాయకుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అన్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, సిరిసిల్లా జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.