
ఒకటే గది.. తరగతులు ఐదు
పెద్దకొడప్‌గల్ : కుబ్యానాయక్ తండాలోని ప్రాథమి క పాఠశాలలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. బడిలో ఒకటే గది ఉంది. ఈ భవనం కూడా శిథిలా వస్థకు చేరింది. ఆఫీస్ రూంతోపాటు ఐదు తరగతు లకు ఇదే గది దిక్కు. కాగా గతేడాది వరకు ఈ బడి లో 39 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఉ పాధ్యాయులు బడిబాటలో భాగంగా ఇంటింటికి వె ళ్లారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బోధిస్తామని, విద్యార్థుల్లో మార్పు రాకపోతే మళ్లీ ప్రైవేట్ పాఠశాలకే పంపించుకోండని చెప్పారు. దీంతో తండావాసులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తుండడంతో ఈసారి విద్యార్థుల సంఖ్య 70కి చేరింది. ప్ర స్తుతం మొదటి తరగతిలో 15 మంది విద్యార్థులుండగా.. రెండో తరగతిలో 19 మంది, మూడో తరగతిలో 14 మంది, నాలుగో తరగతిలో 8 మంది, ఐ దో తరగతిలో 14 మంది విద్యార్థులున్నారు.
గదుల కొరతతో ఇబ్బంది..
పాఠశాలలో 70 మంది విద్యార్థులుండగా.. ఒక్క గది మాత్రమే ఉంది. దీంతో ఆ గదిలోనే ఐదు తరగతుల పిల్లలకు విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి. దీంతో కొంతమందిని చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. అలాగే బడిలో ఉపాధ్యాయుల కొరత ఉంది. 60 మందికన్నా ఎక్కువ విద్యార్థులుంటే నిబంధనల ప్రకారం ముగ్గురు టీచర్లు ఉండాలి. విద్యార్థులకు సరిపడా తరగది గదులు నిర్మించాలని, మరో టీచర్‌ను కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
కుబ్యానాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటే గది ఉంది. అది కూడా శిథిలావస్థకు చేరింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి, తరగతి గదుల మంజూరు కోసం కృషి చేస్తాం. ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగినందున మరో టీచర్‌ను కేటాయించే ఏర్పాట్లు చేస్తాం.
– ప్రవీణ్ కుమార్, ఎంఈవో
పాఠశాల ఆవరణలో
చదువుకుంటున్న
విద్యార్థులు
ఆ తండాలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఐదు తరగతుల్లో 70 మంది విద్యార్థులున్నారు. వీరికి పాఠాలు బోధించడానికి ఉన్నది ఇద్దరు టీచర్లే.. చదువుకోవడానికి ఉన్నది ఒకే ఒక్కగది. దీంతో కొంతమందిని గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతుండగా.. మరికొందరికి చెట్టు కింద బోధిస్తున్నారు.
70 మంది విద్యార్థులకు
ఇద్దరే టీచర్లు
చెట్ల కింద బోధన..
కుబ్యానాయక్ తండా బడిలో
ఇదీ పరిస్థితి
అదనపు గదులు నిర్మించాలని
కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

ఒకటే గది.. తరగతులు ఐదు