
‘యూరియా కొరత పేరుతో దోచుకుంటున్నారు’
గాంధారి: యూరియా కొరత పేరుతో వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బీకేఎస్ నాయకులు మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలను సందర్శించారు. వ్యాపారులు, రైతులతో మాట్లాడారు. ఎరువుల నిల్వల గురించి తెలుసుకున్నారు. యూరియా బస్తాతోపాటు ఇతర రసాయనాలను అంటగడుతున్నారని రైతులు ఆరోపించారు. లేదంటే యూరియా లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీకేఎస్ కార్యదర్శులు శంకర్‌రావు, రావుసాహెబ్‌రావు పాల్గొన్నారు.
యూరియా కొరత లేదు
రైతులు ఆందోళన చెందవద్దని, మండలంలో యూ రియా కొరత లేదని ఏవో రాజలింగం తెలిపారు. యూరియా వాడకం తగ్గించాలని సూచించారు. నా నో యూరియా పిచికారి చేస్తే ఖర్చు తగ్గడమే కాకుండా భూమి సారవంతం అవుతుందన్నారు. వ్యాపారులు యూరియా బస్తాలతో పాటు ఇతర రసాయనాలు ఇస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, తని ఖీలు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.