
‘బాల్య వివాహాలు చేయొద్దు’
మాచారెడ్డి : బాల్య వివాహాలు చేయొద్దని జి ల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి టి. నాగరాణి సూచించారు. సోమవారం గజ్యానాయక్ తండా చౌరస్తాలో న్యాయసేవాధికా రి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం, పోక్సో చట్టం, పిల్లల సంరక్షణ, బ్యాంకు రుణాలు, ఉచిత న్యాయ సలహాలపై అవగాహన క ల్పించారు. కార్యక్రమంలో మాచారెడ్డి, గ జ్యానాయక్ తండా పంచాయతీ కార్యదర్శు లు ఆస్మా బేగం, జీవన్, న్యాయసేవాధికార సంస్థ సభ్యుడు ఖాన్ ఉన్నారు.
జిల్లాలో 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు
కామారెడ్డి క్రైం: శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నెలాఖరు వరకు జిల్లాలో 30, 30 (ఏ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రాజేశ్ చంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ అనుమతి లే కుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధ ర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ని బంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చే స్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
రేపు జిల్లా కేంద్రంలో
జగన్నాథ రథయాత్ర
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో బుధవా రం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇస్కా న్ కామారెడ్డి ఇన్‌చార్జి వెంకటదాస్ తెలిపా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ ఆలయంలో రథయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ యాత్ర విద్యానగర్ కాలనీ లోని పాత సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమై సిరిసిల్ల రోడ్‌లోని శ్రీ కన్యకా ప రమేశ్వరి ఆలయం వద్ద ముగుస్తుందని పే ర్కొన్నారు. యాత్రలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొనాలని కోరారు.
పాఠశాలల అభివృద్ధిలో
భాగస్వాములు కావాలి
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని డీఈవో రాజు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్ నేత ప్రసాద్ రూ. 25వేల విలువైన 56 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని అందించారు. అనంతరం దాతను సన్మానించారు.
చేపల వేట నిషిద్ధం
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో రెండు నెలల పాటు చేపల వేటను నిషేధిస్తున్నా మని ఎఫ్‌డీవో డోలిసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో చేపల ప్రసవ కాలం కావడంతో మత్స్యకారు లు చేపలను వేటాడవద్దని సూచించారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి టౌన్: నిజాంసాగర్‌లోని నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాజు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 29లోపు http://navodaya.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.