
పల్లెల్లో సందడి
రిజర్వేషన్లపై ఉత్కంఠ
మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో u
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పల్లెల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను మూ డు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆశావహులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయ త్నాలు చేస్తున్నారు.
జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు, 4,656 వార్డులు ఉన్నాయి. పంచాయతీల్లో 6,51,422 మంది ఓటర్లు ఉండగా ఇందులో 3,13,280 మంది పురుషులు, 3,38,126 మంది మహిళలు, 16 మంది ఇతరులు ఉన్నారు. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగిసింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లిపోయాయి. అప్పట్లోనే ఎన్నికలు నిర్వహిస్తారని ఆశించినవారు.. ప్రభుత్వం ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తుండడంతో నీరుగారిపోయా రు. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లో పంచాయ తీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించడంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ప్ర భుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతుండడంతో ఈసారి ఎన్నికలు జరుగుతాయన్న భావనలో ఉన్నారు. దీంతో చాలా గ్రామాల్లో ఆశావహులు బలాన్ని, బలగాన్ని పెంచుకునే పనిలో పడ్డా రు. ముఖ్యంగా ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఈసారి ఎక్కువ మంది పోటీపడే అవకాశాలున్నాయి. పాత వారే కాకుండా కొత్త తరం కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఆర్థికంగా ఉన్న వారు కొందరు అప్పుడే ఖర్చులూ మొదలుపెట్టారు. కుల సంఘాలు, యువజన సంఘాల మ ద్దతు కూడగట్టుకుంటున్నారు. మహిళల ఓట్లపైనా కన్నేసి వారి మద్దతు సంపాదించే ప్రయత్నాలు చే స్తున్నారు. ఇప్పటి నుంచే అందరినీ మేనేజ్ చేయడానికి పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో భూముల క్రయవిక్రయాల తో నాలుగు డబ్బులు సంపాదించిన వారే ఎక్కువ గా ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల ఖర్చు భారీగా పెరిగే అవకాశాలున్నాయి.
న్యూస్‌రీల్
త్వరలోనే పంచాయతీ ఎన్నికలు
నిర్వహించే అవకాశం
ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావహులు
వేడెక్కుతున్న రాజకీయాలు
పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం కులగణన కూడా నిర్వహించింది. అయితే దీనికి సంబంధించి న బిల్లుపై స్పష్టత లేదు. ఎ న్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కో ర్టు ఆదేశాల నేపథ్యంలో గ తంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకా రమే ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
యంత్రాంగం రెడీ..
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను గతంలోనే పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులకు మరమ్మతులు చేయించడంతో పాటు రంగులు వేయించారు. ఓటరు తుది జాబితాలు రెడీ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. షెడ్యూల్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు వెంటనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసి ఉంచారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియ షురూ చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు.

పల్లెల్లో సందడి