
గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన
ఎల్లారెడ్డి: పట్టణంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం ఎల్లారెడ్డి షీ టీం ఇన్‌చార్జి శ్రీనివాస్ విద్యార్థినులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన క
ల్పించారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డయల్ 100 ప్రాధాన్యతను వివరించారు. మహిళలు లైంగిక, శారీరక వేధింపులకు గురైతే షీ టీం సభ్యులను సంప్రదించాలన్నారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో షీటీం సహాయం కోసం 8712686094 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్‌కు డయల్ చేయాలని కోరారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియామాలు పాటించాలని సూచించారు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని కోరారు. పాఠశాల ఎంఆర్‌వో రాజు, షీ టీం సభ్యులు పాల్గొన్నారు.
లోతైన దుక్కులతో తెగుళ్ల నివారణ
నవీపేట: లోతైన దుక్కులతో పంటలను ఆశించే తెగుళ్లను నివారించవచ్చని రు ద్రూర్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన రైతులకు సూచనలు చేశారు. వేసవిలో లోతైన దు క్కు లతో నేలతో సంక్రమించే పురుగులను నాశనం చేయవచ్చని వివరించారు. వ్యవసాయాధికారులు సూచించిన మోతాదులోనే యూరియా, ఎరువులను వాడాలని సూచించారు. విత్తన శుద్ధి ప్రాధాన్యతను రైతులకు వివరించారు. శాస్త్రవేత్త పద్మావతి మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి పద్ధతిని అలవాటు చేసుకోవాలని సూచించారు.