
కుక్కల దాడిలో గాయపడిన మహిళ మృతి
దోమకొండ: కుక్కల దాడిలో గాయపడ్డ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన చింపల్ల రేణమ్మ(38) పదిహేను రోజుల క్రితం ఉదయం ఇంటిముందు వాకిలి శుభ్రం చేస్తుండగా వీధి కుక్కలు కరిచాయి. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతిచెందింది. మృతురాలికి భర్త రాజు, ఇద్దరు కూతుళ్లు దేవిక, దివ్య, కుమారుడు సందీప్ ఉన్నారు.
చికిత్స పొందుతూ వృద్దురాలు..
బాల్కొండ: కరెంట్ షాక్‌తో గాయపడిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివ రాలు ఇలా.. ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన దాస పద్మ(50) ఈ నెల 18న తన ఇంట్లో బోర్ మోటర్ స్విచ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా, కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు శనివారం ఉదయం మృతి చెందింది. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై తెలిపారు.

కుక్కల దాడిలో గాయపడిన మహిళ మృతి