
జీలుగ విత్తనాలు సరఫరా
నిజాంసాగర్(జుక్కల్): ‘జీలుగ జాడేదీ’ శీర్షికన ఈనెల 20వ తేదీన ‘సాక్షి’లో ప్ర చురితమైన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లాకు 5 వేల క్వింటాళ్ల జీ లుగ విత్తనాలు అవసరం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారు లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ సంస్థ ద్వారా జిల్లాకు జీలుగ విత్తనా లు సరఫరా చేయాల్సి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ సీడ్ కార్పొరేషన్ సంస్థ ద్వారా జీలుగ విత్తనాలు ఇప్పటికే పంపిణీ చేశారు. కా గా నేషనల్ సీడ్ కార్పొరేషన్ సంస్థలో జీలుగ విత్తనాల నిల్వ లు లేకపోవడం, రైతుల అవసరాలను వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా జిల్లాకు వెయ్యి క్వింటాళ్ల జీలుగ విత్తనా లు సరఫరా చేశారు. జిల్లాకు చేరిన జీలుగ విత్తనాలను మండలాల వారీగా వ్యవసాయశాఖ అధికారులు పంపిణీ చేపడుతున్నారు.

జీలుగ విత్తనాలు సరఫరా