బిచ్కుంద(జుక్కల్): కొత్తగా ఏర్పాటు కానున్న బిచ్కుంద మున్సిపాలిటీలో గోపన్‌పల్లి గ్రామాన్ని కలపడం విషయమై శనివారం అధికారులు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో గ్రామ చావడి వద్ద గ్రామ సభ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ వద్దు జీపీ ముద్దు.. జీపీతో అన్ని సాధించుకుంటామని ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల నుంచి దూరం కావాల్సి వస్తుందని, అన్ని రకాల పన్నులు పెరిగిపోతాయని, అందరి ఏకాభిప్రాయంతో గ్రామ పంచాయతీగా ఉంచాలని నిర్ణయించుకున్నామని గ్రామస్తులు అధికారులకు నివేదించారు. ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని జీపీగా ఉంచాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీతో గ్రామంలో జరిగే అభివృద్ధి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామస్తుల అభిప్రాయాలను అధికారులకు నివేదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో గోపాల్ తదితరులున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణలో
గోపన్‌పల్లివాసులు
ఉన్నతాధికారులకు నివేదిస్తామన్న అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి