రామారెడ్డి : విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి సేవ విభాగం ఆధ్వర్యంలో రామారెడ్డి గ్రామంలో కుట్టు మిషన్‌లో శిక్షణ పొందిన 30 మహిళలకు గురువారం భాగ్యనగర క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం సర్టిఫికెట్లను అందజేశారు. ఈసందర్భంగా గుమ్మల సత్యం మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. భవిష్యత్తులో మాతృమూర్తుల కోసం వివిధ రకాల శిక్షణలను రామారెడ్డి కేంద్రంగా నిర్వహిస్తామన్నారు. అఖిల భారతీయ జనహిత సేవ ట్రస్ట్ ప్రముఖ్ ఉమాదేవి, ప్రాంత సేవా ప్రముఖ్ రాజేందర్, జిల్లా అధ్యక్షులు నిత్యానందం, ఉపాధ్యక్షులు గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి బొల్లి రాజు, సహకార్యదర్శి దరి, జిల్లా సేవా ప్రముఖ్ అజయ్, దుర్గా వాహిని జిల్లా సహసంయోజిక భవాని, విశ్వహిందూ పరిషత్ రామారెడ్డి ప్రఖండ అధ్యక్షులు, తదితరులున్నారు.