బాన్సువాడ/నిజాంసాగర్ : అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్ నాయకులు జుబేర్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారని, వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేయాలన్నారు. ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణచివేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే జుక్కల్ మండల కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మోచీ గణేష్, రమే ష్‌యాదవ్, శివ, అనిల్, సంజయ్, చాకలి మహేష్, సాయిలు, గాండ్ల కృష్ణ, గౌస్, మౌలాన, నర్సింలు, రాజు, సద్దాం, నాగరాజు, జుక్కల్ బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు నీలుపటేల్, గంగాధర్, రమేష్, వెంకట్‌గౌడ్, రవీపటేల్ తదితరులున్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో