చెట్టును ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు

Aug 16 2024 10:40 AM | Updated on Aug 16 2024 10:40 AM

చెట్టును ఢీకొన్న కారు

చెట్టును ఢీకొన్న కారు

భార్యాభర్తలకు గాయాలు

మాచారెడ్డి: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలకు గాయాలైన ఘటన మండలంలోని ఘన్‌పూర్‌ శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌ గ్రామానికి చెందిన నరేందర్‌రెడ్డి, రేణుక దంపతులు పని నిమిత్తం కారులో కామారెడ్డికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో మండలంలోని ఘన్‌పూర్‌ శివారులోకి రాగానే కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీకొన్నారు. ఈ ఘటనలో కారులో ఉన్న భార్యాభర్తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement