బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలు అన్నివిధాలా దగా పడుతున్నారని భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు తెలిపారు. ఓటు బ్యాంకుగా బీసీలను వాడుకుని వదిలివేయడానికే టీడీపీ పనిగా పెట్టుకుందన్నారు. స్థానిక ఓ హోటల్‌లో ఆదివారం ఆ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నట్లు నాటకమాడుతున్న టీడీపీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెబుతామన్నారు. గెలుపోటములు పక్కనపెట్టి, అన్ని మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకుడు షీతల్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని, నేడు వారి నాయకుడు రంగా విగ్రహం పెట్టుకొనేందుకు కూడా ఇబ్బందులు పెడుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కాపులతో పాటు, ఎస్సీ, ఎస్టీ నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో కర్రి గోపాలకృష్ణ, రాయుడు సుధాకర్, శీరం శ్రీను, నాగేశ్వరి, పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు గొంప శివ తదితరులు పాల్గొన్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్
ఎక్స్ఛేంజీలో చోరీ
రాజవొమ్మంగి: స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ ఎక్స్ఛేంజీలో (సెల్‌వన్ ఆఫీస్) దొంగతనం జరిగింది. బ్యాటరీ బ్యాకప్‌కు చెందిన కాపర్ వైర్, కనెక్టర్లు చోరీ అయ్యాయి. దీని విలువ సుమారు రూ.30 వేల విలువ ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ ఏఈ సతీష్ ‘సాక్షి’తో అన్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆదివారం ఉదయం డ్యూటీకి వచ్చిన ఆపరేటర్ అప్పారావు తలుపులు తీసి ఉండటంతో అవాక్కయ్యాడు. లోనికి వెళ్లి చూడగా కీలకపై కాపర్‌వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. ముందు రోజు రాత్రి ఈ చోరీ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో సెల్‌ఫోన్ టవర్ ఆగిపోయింది. దాదాపు 20 గ్రామాలకు కనెక్షన్ కట్ అయ్యింది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ పని చేయలేదు. కాగా తమ సిబ్బందిని పంపామని, మరమ్మతులు చేస్తున్నారని బీఎస్‌ఎన్‌ఎల్ ఏలేశ్వరం కార్యాలయం ఏఈ సతీష్ అన్నారు. రాజవొమ్మంగిలో ఈ విధంగా దొంగతనం జరగడం ఇది రెండోసారి అని సతీష్ అన్నారు. గతంలో ఈ కార్యాలయంలో మరమ్మతులు చేసేందుకు వచ్చిన ప్రైవేటు టెక్నికల్ సిబ్బంది ఈ చోరీకి కారణమని ఏఈ అభిప్రాయపడ్డారు. ప్రత్తిపాడు, అడ్డతీగల ఎక్స్ఛేంజీలో కూడా ఈ తరహా దొంగతనాలు జరిగాయన్నారు. హై ఓల్టేజీ ఉన్నప్పటికీ వైర్లు దొంగిలించారంటే అన్నీ తెలిసిన టెక్నీషియన్ల పనేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వైపు నుంచి ఎక్స్ఛేంజీ గోడ దూకి, ఎక్స్చేంజీ (బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు) తలుపులు పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించినట్లు ఏఈ తెలిపారు. పై అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. కొత్త సామగ్రి అమర్చడంతో పాటు మరమ్మతులు జరుగుతున్నాయని, సిగ్నల్స్‌ను ఈ రాత్రికే పునరుద్ధరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా రాజవొమ్మంగి ఎస్సై వెంకటరావు సంఘటన స్థలానికి వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.
రేషన్ కార్డుకు
మొబైల్ లింక్ తప్పనిసరి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రేషన్ కార్డుదారులందరూ తమ రేషన్ కార్డుకు మొబైల్ ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని జేసీ వై.మేఘ స్వరూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ పెద్ద ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌నే రేషన్ కార్డుకు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే అక్టోబర్ నెల రేషన్ తీసుకున్న లబ్ధిదారులు సంబంధిత రేషన్ దుకాణదారుడిని సంప్రదించి తమ మొబైల్ నంబర్‌ను నమోదు చేయించుకోవాలని కోరారు.
రూ.30 వేల విలువైన
కాపర్ వైరు మాయం
బీఎస్‌ఎన్‌ఎల్ ఫోన్లు,
నెట్‌వర్క్‌కు అంతరాయం


